Co Win: భారత్ కో-విన్ సిస్టంపై ఆసక్తిని ప్రదర్శిస్తున్న 50 దేశాలు

  • వ్యాక్సినేషన్ డీటెయిల్స్ మొత్తం కో-విన్ లో రిజిస్టర్ అవుతున్న వైనం
  • ఈ సిస్టంపై ఆసక్తి చూపుతున్న కెనడా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు
  • ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్న భారత్
50 countries are showing on Indias Cowin System

కరోనా మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నంలో భారత ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు కృషి చేస్తోంది. దేశంలో ఎవరు, ఎక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నా వారి వివరాలు కో-విన్ సిస్టమ్ లో రిజిస్టర్ అవుతున్నాయి. తద్వారా ఎవరు ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నారు? ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారు? అనే వివరాలు కేంద్రానికి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి. ఈ డేటా ఆధారంగా కేంద్రం తరుపరి కార్యాచరణను చేపట్టడానికి వీలుపడుతోంది.

మరోవైపు, కో-విన్ సిస్టమ్ పలు దేశాలను ఆకర్షిస్తోంది. ఈ తరహా సిస్టమ్ ను అమలు చేయడానికి కెనడా, మెక్సికో, పనామా, నైజీరియా తదితర 50 దేశాలు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఈ దేశాలకు భారత ప్రభుత్వం కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. కో-విన్ సాఫ్ట్ వేర్ ను ఆయా దేశాలకు అందించేందుకు సుముఖతను వ్యక్తం చేస్తోంది.
 
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కో-విన్ కు సంబంధించి ఓపెన్ సోర్స్ వెర్షన్ ప్లాట్ ఫామ్ ను తయారు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు. ఈ ప్లాట్ ఫామ్ పై మధ్య ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు ఆసక్తిని చూపుతున్నాయని తెలిపారు. ఈ సిస్టమ్ ఎంత గొప్పగా పని చేస్తోందో ప్రపంచ దేశాలకు తాము చెపుతున్నామని, అన్ని దేశాలకు ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

More Telugu News