ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయండి... గవర్నర్ బిశ్వభూషణ్ కు నారా లోకేశ్ లేఖ
- గ్రూప్-1 మెయిన్స్ పై లోకేశ్ లేఖ
- డిజిటల్ మూల్యాంకనంపై చర్యలు తీసుకోవాలని వినతి
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
- నిరుద్యోగ యువతకు నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి
"ఏపీపీఎస్సీ సభ్యులను నియమించే అధికారం ఉన్న మీరు వెంటనే జోక్యం చేసుకుని, డిజిటల్ వేల్యుయేషన్ పై అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీపై నిరుద్యోగ యువతకు తిరిగి నమ్మకం కలిగించేలా ప్రక్షాళన చేయాలని గవర్నర్ ను కోరారు.