తెలంగాణలో కొత్తగా 1,798 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు
- గత 24 గంటల్లో 1,30,430 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 174 మందికి పాజిటివ్
- అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 కేసులు
- 95.48 శాతానికి పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో ఇప్పటిదాకా 5,98,611 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,71,610 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 23,561 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,440కి చేరింది. అటు, రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు మరింత పెరిగి 95.48 శాతానికి చేరింది.