Nara Lokesh: మోదీకి స‌మ‌యం దొరికింది కానీ.. జ‌గ‌న్‌కు దొర‌క‌లేదు: నారా లోకేశ్

lokesh slams ycp
షార్ట్స్‌లో చూడండి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలోనూ ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని టీడీపీ నేత‌ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయ‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో సీబీఎస్ఈ పరీక్షలపై చర్చించి ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని గుర్తు చేశారు.

ప్ర‌ధాని మోదీకి స‌మీక్ష నిర్వ‌హించ‌డానికి  స‌మయం ఉంది కానీ సీఎం జ‌గ‌న్‌కు లేదు అని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌కుండా వాయిదా వేస్తూ వెళ్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం మంచి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. వారంతా పరీక్ష‌ల గురించి ఆందోళ‌న చెందుతున్నార‌ని ఆయ‌న అన్నారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల నుంచి అభిప్రాయలు స్వీక‌రించి ప్ర‌భుత్వానికి లోకేశ్ నివేదిక ఇవ్వ‌నున్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News