దేశంలో మరో విదేశీ వ్యాక్సిన్ కు రంగం సిద్ధం
- భారత్ లో అనుమతుల కోసం విదేశీ టీకాల నిరీక్షణ
- కెనడా సంస్థ ప్రావిడెన్స్ తో బయోలాజికల్ ఈ సంస్థ ఒప్పందం
- కెనడా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ
- అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం
దీని ప్రకారం కెనడా వ్యాక్సిన్ కు బయోలాజికల్ ఈ సంస్థ భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. కేంద్రం నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు కోరనుంది. కాగా, ఒప్పందంలో భాగంగా ప్రావిడెన్స్ సంస్థ బయోలాజికల్ ఈ సంస్థకు 30 మిలియన్ డోసులను విక్రయించనుంది. టీకా ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని కూడా బదలాయించనుంది.
కాగా, ఈ ఒప్పందం ప్రకారం వంద కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా, 2022 నాటికి 600 మిలియన్ డోసులు తయారుచేయనున్నారు. బయోలాజికల్ ఈ సంస్థ ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా వేరే ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 600 మిలియన్ డోసుల జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఉత్పత్తి చేయనుంది.