రవితేజ హీరోగా సినిమా నిర్మిస్తున్న రామ్ చరణ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ హీరోగా సినిమా నిర్మిస్తున్న రామ్ చరణ్?

Driving Licence remake movie in Raviteja
  • మలయాళంలో హిట్ కొట్టిన 'డ్రైవింగ్ లైసెన్స్'
  • తెలుగు రీమేక్ రైట్స్ చరణ్ చేతికి
  • హీరోగా తెరపైకి రవితేజ పేరు
ఇటీవల కాలంలో తెలుగులోకి మలయాళ సినిమాల రీమేక్ లు పెరుగుతున్నాయి. మలయాళం రీమేక్ గా వెంకటేశ్ 'దృశ్యం 2' సినిమాను చేస్తుండగా, చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ చేయనున్నారు. ఇక మలయాళం నుంచి మరో రీమేక్ కూడా దిగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .. ఆ సినిమా పేరే 'డ్రైవింగ్ లైసెన్స్'. 2019లో మలయాళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు .. వైవిధ్యభరితమైన సినిమాగా ప్రశంసలను అందుకుంది.

అలాంటి సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ రీమేక్ లో చరణ్ చేస్తాడా? లేదంటే పవన్ చేస్తాడా? అనే విషయంపై చర్చలు బాగానే నడిచాయి. అయితే ఈ రీమేక్ లో చరణ్ గానీ .. పవన్ గాని చేయడం లేదు. మరి ఎవరు చేస్తున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా రవితేజ పేరు వినిపిస్తోంది. చరణ్ నిర్మాణంలోనే ఈ సినిమా రూపొందుతుందట. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన సినిమాలో రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు. ఇక అక్కడ సూరజ్ చేసిన పాత్రకిగాను రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Raviteja
Charan
Driving Licence Movie

More Telugu News