Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంఏ అజీజ్ కన్నుమూత

Congress leader MA Azeez died with Heart Attack
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంఏ అజీజ్ నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన అజీజ్ అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1978-1983 మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. నిడదవోలుకు చెందిన ఆయన 1983 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Go Back to Shorts
Andhra Pradesh
MA Azeez
Congress

More Telugu News