'హరి హర వీరమల్లు' గ్రాఫిక్స్ కోసం భారీ ఖర్చు!
- క్రిష్ నుంచి మరో చారిత్రక చిత్రం
- మొగల్ సెట్ల కోసం భారీ ఖర్చు
- గ్రాఫిక్స్ కోసం 50 కోట్ల కేటాయింపు?
కథా పరంగా గ్రాఫిక్స్ కి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కేవలం గ్రాఫిక్స్ కోసమే 50 కోట్ల రూపాయలను కేటాయించారట. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను నియమించడమే ఇంతటి ఖర్చుకు కారణమని చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారట. పవన్ కల్యాణ్ కెరియర్లో ఇది మొదటి చారిత్రక చిత్రం కావడంతో, అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా, కరోనా ప్రభావం తరువాత మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.