Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొత్త సినిమా టైటిల్ ప్రకటన?

  • ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్'
  • తదుపరి చిత్రం కొరటాల శివతో
  • టైటిల్ పోస్టర్ రానుందనే టాక్
  • త్వరలో షూటింగ్ మొదలు  
Ntr fans has focus on his birthday

ఎన్టీఆర్ అభిమానులంతా ఈ నెల 20వ తేదీ కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అభిమానుల అంచనాలను పెంచుతూ వచ్చాయి. అదే విధంగా ఎన్టీఆర్ బర్త్ డే రోజున, ఆయన పాత్రకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ పోస్టర్ ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది.

ఇక ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ లుక్ పై కూడా ఆయన ఒక క్లారిటీతో ఉన్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. అందువలన ఆ రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలే అవకాశాలు లేకపోలేదు అనే టాక్ వినిపిస్తోంది. దాంతో అభిమానులు మరింత ఆసక్తితో ఉన్నారు. అలా ఈ సారి ఎన్టీఆర్ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మారనుంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని పేరు వినిపిస్తోంది. త్వరలోనే షూటింగు మొదలు కానుంది.

More Telugu News