Jr NTR: ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్ తోనే!

  • హోమ్ క్వారంటైన్ లో ఎన్టీఆర్  
  • ఇంగ్లిష్ డైలీతో ఫోన్ ఇంటర్వ్యూ
  • తన సినిమాలపై స్పష్టత
  • దసరాకి 'ఆర్ఆర్ఆర్' వచ్చే ఛాన్స్
Ntr another movie with Prashanth Neel

ఎన్టీఆర్ .. కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా సెట్ అయిందనే విషయం తెలిసిందే. ఇది కూడా పాన్ ఇండియా మూవీకి దగ్గరగానే వెళ్లనుంది. ఆ తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో ఉండనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ హీరోగా 'సలార్' చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా .. పైగా ప్రశాంత్ నీల్ షూటింగుకు చాలా సమయం తీసుకుంటాడు. అందువలన ఎన్టీఆర్ తో ప్రాజెక్టు విషయంలో చాలామందికి అనుమానాలు వచ్చాయి. కానీ తమ కాంబినేషన్లో సినిమా ఉందనే విషయాన్ని తాజాగా ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న ఎన్టీఆర్, ఒక ఇంగ్లిష్ డైలీతో ఫోన్లో మాట్లాడాడు. కెరియర్ పరంగా 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్న తాను, 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు చెప్పాడు. కొరటాల సినిమా పూర్తికాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అన్నాడు. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని చెప్పాడు.

ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగు 19 నెలల పాటు జరిగిందనీ, ఈ సినిమా కోసం తాము చాలా కష్టపడ్డామని అన్నాడు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చాలా హెవీగా ఉంటాయని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లోను ఈ సినిమా దసరాకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.

More Telugu News