ఎన్టీఆర్... జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
- జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా
- ఐసోలేషన్ లో చికిత్స
- స్పందించిన చంద్రబాబు, లోకేశ్
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. కరోనా నుంచి సత్వరమే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. తారక్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇక, జూనియర్ మేనత్త, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ట్వీట్ చేశారు. నీవు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని స్పందించారు.