కడప జిల్లాలో పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
- ముగ్గురాయి గనిలో పేలుడు
- జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది దుర్మరణం
- అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
కలసపాడు మండలం మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ ను కిందికి దింపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి వాహనం తుత్తునియలు అయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి.