హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న 'ఆది పురుష్'
- ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్'
- ప్రభాస్ సరసన కృతి సనన్
- ముంబై షూటింగులో ఇబ్బందులు
- హైదరాబాద్ లోనే మేజర్ షెడ్యూల్
ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్లు ముంబై స్టూడియోలో వేశారు. అంతేకాదు ముంబై బీచ్ సమీపంలోని ఒక విశాలమైన ప్రదేశంలోను మరికొన్ని సెట్లు వేయాలని భావించారట. అయితే షూటింగుకు వచ్చి వెళ్లాలంటే ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అలా చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అందువలన వేసిన సెట్ల వలన నష్టం వచ్చినా ఫరవాలేదు .. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లు వేయించి .. అక్కడే ఉంటూ మూడు నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ చేసి, మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట.