Corona Virus: దేశంలో క‌రోనాతో ఒక్క రోజులో 2,771 మంది మృతి

India reports 3 lakh new  COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
భార‌త్‌లో ప్ర‌తిరోజు మూడు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న‌ కొత్త‌గా 3,23,144 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,51,827 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,771  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,45,56,209  మంది కోలుకున్నారు. 28,82,204 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,52,71,186 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,09,79,877 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,58,700 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News