భారత్‌లో మరో టీకా మూడో దశ క్లినికల్ ప్రయోగాలకు అనుమతి!
- బయోలాజికల్-ఈ టీకా ప్రయోగాలకు సీడీఎస్‌సీఓ ఓకే
- ఇప్పటికే తొలి రెండు దశలు పూర్తి చేసుకున్న వ్యాక్సిన్
- సమర్థమైన రోగనిరోధకత ఏర్పడిందని వెల్లడి
- మూడో దశలో 1,268 మందిపై ప్రయోగం
భారత్‌లో మొత్తం 15 ప్రాంతాల్లో మూడో దశ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు బయోలాజిల్-ఈ వెల్లడించింది. 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల 1,268 మందిపై ప్రయోగించి ఈ టీకా సామర్థ్యాన్ని తేల్చనున్నట్లు తెలిపింది. తొలి రెండు దశల్లో 18-65 ఏళ్ల మధ్య వయసు గల 360 మందిపై ప్రయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపింది. సమర్థమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడంతో పాటు ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపింది.