Andhra Pradesh: ఏపీలో మరో 11,698 కరోనా పాజిటివ్ కేసులు, 37 మరణాలు

AP witnesses corona second wave
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 50,972 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం (1,066) జిల్లాల్లోనూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,421 మంది కరోనా నుంచి కోలుకోగా, 37 మంది మృత్యువాత పడ్డారు.

ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 10,20,926కి పెరిగింది. 9,31,839 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 81,471 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,616కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Second Wave
New Cases
Deaths
Active Cases
Today Cases
AP

More Telugu News