Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'పుష్ప' షూటింగులో చేరిన అనసూయ
  • దూసుకుపోతున్న 'అఖండ' టీజర్
  • షూటింగుకి రెడీ అవుతున్న వరుణ్ తేజ్  
Anasuya joins Pushpa shoot

*  ఆమధ్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అలరించిన యాంకర్ అనసూయ ఇప్పుడు మళ్లీ ఆయన దర్శకత్వంలోనే 'పుష్ప' సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగులో తాను నిన్న జాయిన్ అయినట్టు అనసూయ పేర్కొంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న సంగతి విదితమే!
*  బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ' సినిమా టీజర్ యూ ట్యూబ్ లో దూసుకుపోతోంది. ఉగాది నాడు రిలీజైన ఈ టీజర్ కి ఇప్పటివరకు 32 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అన్నది పెద్ద విశేషం. ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయన్నది దీనిని బట్టి అర్థమవుతోంది.
*  వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును త్వరలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ, ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఇందులో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News