Corona Virus: దేశంలో నిన్న‌ 2.34 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ‌

India reports 234692 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ తీవ్ర రూపం దాల్చింది. ప్ర‌తి రోజు రెండు ల‌క్ష‌ల‌ మందికి పైగా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అవుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న‌ కొత్త‌గా 2,34,692 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,23,354  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 1,341  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,75,649కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,26,71,220 మంది కోలుకున్నారు. 16,79,740 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 11,99,37,641 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,49,72,022 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,95,397 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News