'ఎఫ్ 3'లో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన అంజలి!

Anajali is doing F3 movie
  • అచ్చ తెలుగు పిల్ల అంజలి
  • 'వకీల్ సాబ్'తో దక్కిన హిట్
  • పెరుగుతున్న అవకాశాలు    
అంజలి అచ్చ తెలుగు అమ్మాయి .. రాజోలు పిల్ల. అయితే ముందుగా తమిళ కుర్రాళ్ల కొంటె గుండెలకు గిలిగింతలు పెట్టిన తరువాతనే ఇటు వచ్చింది. తెరపై కలివిడిగా తిరుగుతూ ఇక్కడి పిల్లగాళ్ల మనసులను కూడా మల్లెతీగలా అల్లుకుపోయింది. వరుస సినిమాలు .. వరుస విజయాలతో అంజలి తన దూకుడు చూపించింది. కాలం ఎప్పుడూ ఒకే తీరున ఉండదు కదా.. కొత్త హీరోయిన్ల పోటీ వలన అమ్మడికి కాస్త అవకాశాలు తగ్గాయి. అయినా నెగ్గుకు రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలా 'నిశ్శబ్దం' తరువాత ఆమె చేసిన 'వకీల్ సాబ్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


'వకీల్ సాబ్' హిట్ తో అంజలి మరోసారి అందరి దృష్టిలో పడింది. దాంతో ఈ అమ్మాయికి మళ్లీ ఆఫర్లు పెరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. తాజాగా 'ఎఫ్ 3'లో మూడో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా సోనాల్ చౌహన్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా అంజలి పేరు తెరపైకి వచ్చింది. త్వరలో షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. అంజలి యాడ్ అయితే 'ఎఫ్ 3' సందడి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆగస్టు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Venkatesh
Varun Tej
Thamannah
Mehreen

More Telugu News