తగ్గేదే లే... 'పుష్ప'రాజ్ లా విరాట్ కోహ్లీ... లైక్ కొట్టిన అల్లు అర్జున్
- ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం
- స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఆకట్టుకున్న కోహ్లీ
- అల్లు అర్జున్ ను తలపించే పిక్ పంచుకున్న స్టార్ స్పోర్ట్స్
- ఆర్సీబీపై ప్రశంసలు
ఓటమి సరిహద్దుల దాకా వెళ్లి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేశారని స్టార్ స్పోర్ట్స్ తెలుగు కితాబిచ్చింది. సరిలేరు మాకెవ్వరు అనే మాటకు నిదర్శనంగా నిలిచారని, ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో కోహ్లీ మంత్రం ఫలించిందని, మొదటి మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచేసిందని వివరించింది. కాగా ఈ పోస్టును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్టపడ్డారు. ఎమోజీలతో తన స్పందన తెలియజేశారు.