యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు లోయలో పడి 12 మంది మృత్యువాత
- 35 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన వాహనం
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన యోగి
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ప్రమాద వార్త తెలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.