Chiranjeevi: 'ఆచార్య' విషయంలో కొరటాలకు చిరూ సూచన!

  • షూటింగు దశలో ఉన్న 'ఆచార్య'
  • ఈ రోజు షూటింగు సోమవారానికి వాయిదా
  • ఈ నెల చివరికి పూర్తి కానున్న షూటింగ్  
Chiranjeevi dedline to Koratala Shiva for Acharya movie

మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'ఆచార్య' సినిమాపైనే ఉంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ రోజు నుంచి చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్లో చరణ్ పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ లో చరణ్ తో పాటు చాలామంది డాన్సర్లు పాల్గొననున్నారు. అయితే అనుకోకుండా షూటింగు కేన్సిల్ అయిందట. సోమవారం నుంచి ఈ సాంగ్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత కారణంగా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనీ, ఎలాంటి పరిస్థితుల్లోను షూటింగు వాయిదా పడకుండా చూడమని కొరటాలతో చిరంజీవి చెప్పారట. ఈ నెల చివరి నాటికి షూటింగు పార్టు పూర్తికావాలని అన్నారట. మే మొదటి వారం నుంచి నిర్మాణానంతర పనులు మొదలైపోవాలని సూచించినట్టు, ఆ ప్రకారమే జరుగుతుందని కొరటాల చెప్పినట్టుగా అనుకుంటున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటించిన ఈ సినిమాలో, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే.

More Telugu News