Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in loses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో... బ్యాంకుల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది.

మరోవైపు భారత్ లో ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో ఉందని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. దీంతో, మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 627 పాయింట్లు నష్టపోయి 49,509కి పడిపోయింది. నిఫ్టీ 154 పాయింట్లు పతనపై 14,690 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.82%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.90%), టీసీఎస్ (0.56%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.06%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.71%), టెక్ మహీంద్రా (-2.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.71%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News