ధన్యవాదాలు తెలుపుతూ మోదీకి లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్
- పాకిస్థాన్ డే సందర్భంగా ఇమ్రాన్ కు లేఖ రాసిన మోదీ
- పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటామన్న ఇమ్రాన్
- కశ్మీర్ వివాదానికి ముగింపు పలకాలని విన్నపం
భారత్ సహా పొరుగు దేశాలన్నింటితో పాక్ ప్రజలు శాంతిని, పరస్పర సహకారాన్ని కోరుకుంటారని ఇమ్రాన్ తెలిపారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాలు, ముఖ్యంగా కశ్మీర్ వివాదానికి ముగింపు పలికితేనే దక్షిణాసియాలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని చెప్పారు. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు. కరోనాపై భారత ప్రజలు అద్భుతంగా పోరాడుతున్నారని కొనియాడారు.