nitin: నితిన్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

nitin new movie first look releases
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస‌గా సినిమాల్లో న‌టిస్తూ దూసుకుపోతున్నాడు. చెక్‌, రంగ్‌దే సినిమాల త‌ర్వాత ఆయ‌న‌ న‌టిస్తోన్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు విడుద‌ల‌య్యాయి. నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ లుక్ విడుద‌ల చేశారు. ఈ సినిమాకు 'మాస్ట్రో' టైటిల్‌ను ఖ‌రారు చేశారు. నితిన్ ఫ‌స్ట్ లుక్ అల‌రిస్తోంది.

బాలీవుడ్ హిట్ సినిమా అంధాధున్ ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఇందులో నభా నటేశ్, తమన్నా కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకు మహతీసాగర్ సంగీతం అందిస్తున్నారు.‌
Go Back to Shorts
nitin
Tollywood

More Telugu News