ఏపీ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్నీ
- ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ
- కొత్త ఎస్ఈసీ కోసం ముగ్గురి పేర్లను ప్రతిపాదించిన సర్కారు
- నీలం సాహ్నీ పేరు ఖరారు చేసిన గవర్నర్
- వచ్చే నెల 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్నీ
నీలం సాహ్నీ ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. నీలం సాహ్నీ గత డిసెంబరులో ఏపీ సీఎస్ గా పదవీ విరమణ చేశారు. ఆపై ఆమె సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా నియమితులవడం తెలిసిందే.