shruti hassan: మాడిపోయిన శ్రుతిహాసన్ వంటకం.. బాయ్ ఫ్రెండ్ సెటైర్!

  • డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమ
  • ఏదో ఆలోచిస్తూ ఉండ‌డంతో మాడిన వంట‌
  • వెస్టెడ్‌ పైనాపిలా?‌ లేక రోస్టెడ్‌ పైనాపిలా? అంటూ ప్రియుడి కామెంట్‌
shruti hassan video goes viral

సినిమా షూటింగుల‌కు రెండేళ్ల విరామం తీసుకున్న హీరోయిన్ శ్రుతిహాస‌న్ ప్ర‌స్తుతం మ‌ళ్లీ ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ సినిమాలో నటిస్తోంది. మరోపక్క, ఈ ముద్దుగుమ్మ‌ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో  ప్రేమలో ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె శాంత‌నుతో క‌లిసి ఓ మ్యూజిక్‌ వీడియో చేయడానికి సిద్ధ‌మైన‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

గ‌తంలో ర్యాపర్‌గా శాంత‌ను‌ కొన్ని పాటలు పాడాడు. తాము రూపొందించ‌నున్న ఓ మ్యూజిక్‌ వీడియో గురించి శ్రుతి ఇటీవ‌ల చేసిన ట్వీట్ వైర‌ల్ అయింది. తాజాగా, వీరికి సంబంధించిన మ‌రో వీడియో వైర‌ల్ అవుతోంది. ఇందులో త‌న ప్రియుడి కోసం శ్రుతిహాసన్ స్వయంగా వంట చేసింది. అయితే, ఆ స‌మ‌యంలో శ్రుతి ఏదో ఆలోచిస్తూ ఉండ‌డంతో ఆ వంట మాడిపోయింది. దీంతో దానిని వెస్టెడ్‌ పైనాపిలనాలా?‌ లేక రోస్టెడ్‌ పైనాపిలనాలా? అంటూ ఆమె ప్రియుడు కామెంట్‌ చేశాడు.

More Telugu News