Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్'లో అలియా కోసం మరిన్ని సీన్లు!

Some more scenes added to Alia role in RRR
షార్ట్స్‌లో చూడండి
ఒక్కోసారి ముందు అనుకున్న స్క్రిప్టుకి షూటింగులో అదనంగా కొన్ని సీన్లు కలుపుతుంటారు. ఆ పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ చిత్రం షూటింగు ఇప్పుడు  చివరి దశకి చేరింది.

ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఈ మల్టీ స్టారర్ నిర్మాణం జరుపుకుంటున్న సంగతి విదితమే. ఇక ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తాడు. చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. ఆయా పాత్రలకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ఇక చరణ్, అలియాలపై ఒక పాట మాత్రం మిగిలివుంది. దీనిని ఈ నెలాఖరులో హైదరాబాదులో చిత్రీకరిస్తారు.

 ఇదిలావుంచితే, సీత పాత్రకు ఇప్పుడు అదనంగా కొన్ని సీన్లను జతచేయాలని  దర్శకుడు భావిస్తున్నాడట. ఈ విషయమై ఆమెను కూడా సంప్రదించడం జరిగిందనీ, ఆమె కూడా కొత్తగా కొన్ని డేట్లు ఇస్తోందని తెలుస్తోంది. బ్యాలెన్స్ పాట చిత్రీకరణ  సమయంలోనే అలియాపై ఆ సీన్లు కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.  
Go Back to Shorts
Alia Bhatt
Ramcharan
NTR
Rajamouli

More Telugu News