Sensex: 397 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Sensex ends 397 points low
షార్ట్స్‌లో చూడండి
దేశీయ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో మన మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397 పాయింట్లు నష్టపోయి 50,395కు పడిపోయింది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 14,929కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.22%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.51%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.24%), ఎన్టీపీసీ (1.14%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.68%), బజాజ్ ఆటో (-2.21%), బజాజ్ ఫైనాన్స్ (-2.09%), ఎల్ అండ్ టీ (-1.99%), ఏసియన్ పెయింట్స్ (-1.92%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News