రవితేజ సినిమాలో 'గాలి సంపత్' నాయిక

Lovely Singh opposite Raviteja
  • 'గాలి సంపత్' విడుదల కాకుండానే మరో ఆఫర్
  • త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 
  • ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా లవ్లీ సింగ్  
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ కి బాలీవుడ్ భామల రాక ఎక్కువైందనే చెప్పాలి. ఉత్తరాది భామలు అందాలు ఆరబోయడానికి సిద్ధంగా ఉంటారనీ, ఎటువంటి అభ్యంతరాలు చెప్పరన్న ఉద్దేశంతోనే మన వాళ్లు ఎక్కువగా వాళ్లని పరిచయం చేస్తుంటారు. అలాగే తాజాగా 'గాలి సంపత్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన మరో ముద్దుగుమ్మ లవ్లీ సింగ్. ఈ సినిమా విడుదల కాకుండానే ఈ చిన్నదానికి తెలుగులో అప్పుడే మరో ఛాన్స్ వచ్చేసింది. అదీ రవితేజ సరసన నటించే అవకాశం కావడం విశేషం!

ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఒకరిగా తాజాగా లవ్లీ సింగ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడవచ్చు!  
Go Back to Shorts
Lovely Singh
Raviteja
Trinatha Rao
Ramesh Varma

More Telugu News