ఫొటో అడిగిన అభిమానికి ఝ‌ల‌క్ ఇచ్చిన యాంక‌ర్ శ్రీముఖి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫొటో అడిగిన అభిమానికి ఝ‌ల‌క్ ఇచ్చిన యాంక‌ర్ శ్రీముఖి!

srimukhi shares rgv movie poster
  • ఇన్ స్టా స్టోరీస్‌లో అభిమానుల ప్ర‌శ్న‌ల‌కు శ్రీముఖి స‌మాధానాలు
  • న‌గ్న ఫొటో అడ‌గ‌డంతో ఆర్జీవో న‌గ్నం సినిమా టైటిల్ ఫొటో పోస్ట్
  • త‌న అభిమాన హీరో ఫొటోనూ పోస్ట్ చేసిన యాంక‌ర్
సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉండే యాంక‌ర్ శ్రీముఖి త‌న అభిమానులు అడుగుతోన్న ప్ర‌శ్న‌ల‌కు అప్పుడ‌ప్పుడు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా, ఆమె అభిమానులు అడిగే ఫొటోలు పంపుతాన‌ని, ఏదైనా ఆస‌క్తికర విష‌యాలు అడిగితేనూ చెబుతాన‌ని శ్రీముఖి త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చెప్పింది.

అభిమానులు అడిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది. అయితే, ఓ అభిమాని ఆమె న‌గ్న చిత్రం అడిగాడు. దీంతో అత‌డికి శ్రీముఖి ఝ‌ల‌క్ ఇచ్చింది. నేకెడ్, నగ్నం పేరిట ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తీసిన సినిమా టైటిల్ పేరును పంపింది. ఆమె సమయస్ఫూర్తికి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

కాగా, నీ అభిమాన హీరో ఎవ‌ర‌ని శ్రీముఖిని మ‌రో అభిమాని అడ‌గ‌గా ఆమె చిరంజీవి ఫొటో పోస్ట్ చేసింది. త‌న‌కు ప‌ప్ప‌న్నం, ఆవ‌కాయ ఇష్ట‌మ‌ని మ‌రో అభిమాని ప్ర‌శ్న‌కు స‌మాధానంగా శ్రీముఖి చెప్పింది.  అలాగే, ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌కు స‌మాధానాలు చెబుతూ ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో అనేక ఫొటోలు పోస్ట్ చేస్తోంది.  

    
srumukhi
RGV
Tollywood

More Telugu News