పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ తొక్కని అడ్డదారులు లేవు: లోకేశ్
- పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలంటూ లోకేశ్ వ్యాఖ్యలు
- అరాచకాలు సృష్టించారని వెల్లడి
- అధికారులను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపణ
- ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని వెల్లడి
అధికార మదంతో అరాచకాలు సృష్టించారని, అర్ధరాత్రి అధికారులను ప్రలోభాలకు గురిచేసి, విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. చీకటి మాటున గెలిచాం అని ప్రకటించుకున్నా, పగలు ధైర్యంగా తిరగలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని, ఆధారాలు పరిశీలించి రీకౌంటింగ్ కు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.