హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన వైఎస్ షర్మిల!
- గతంలో కాంగ్రెస్ కు అండగా నిలిచిన ఖమ్మం
- మూడు రోజుల తరువాత హైదరాబాద్ కు షర్మిల
- ఆపై పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తారన్న కొండా రాఘవరెడ్డి
ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో భేటీపై స్పందించిన ఆయన, వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో వెన్నంటి నడిచిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డని, వారిద్దరి మధ్యా కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే జరిగిందని అన్నారు.
ఇక హైదరాబాద్ నుంచి 21న ఉదయం 8 గంటలకు లోటస్ పాండ్ నుంచి ఖమ్మంకు బయలుదేరే షర్మిల కాన్వాయ్, రోడ్ నంబర్ 12, మాసబ్ ట్యాంక్, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, చౌటుప్పల్, సూర్యాపేట, పాలేరు మీదుగా సాగుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నేతల కోరిక మేరకే ఈ టూర్ ను షెడ్యూల్ చేసినట్టు తెలిపారు.