తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులుగా రాములు నాయక్, చిన్నారెడ్డి ఖరారు

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులుగా రాములు నాయక్, చిన్నారెడ్డి ఖరారు

Ramulu Nayak and Chinna Reddy are the Congress candidates contest in Telangana graduates MLC elections
  • త్వరలో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • అభ్యర్థులను ఎంపిక చేసిన సోనియా గాంధీ
  • రాములు నాయక్, చిన్నారెడ్డిలకు చాన్స్
  • ఓ అభ్యర్థిని ఖరారు చేసిన టీఆర్ఎస్
తెలంగాణలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం రాములు నాయక్.... హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం కోసం జి.చిన్నారెడ్డిలను ఎంపిక చేశారు. వీరిద్దరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపారు.

అటు, టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే ఓ అభ్యర్థి పేరు ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరునే ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిని త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ తరఫున ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడతారని ప్రచారం జరుగుతోంది.
Ramulu Nayak
Chinna Reddy
MLC
Graduate
Congress
Telangana

More Telugu News