Vijay Sai Reddy: చంద్రబాబు జీవితమంతా ఇలా డబ్బు వెదజల్లడమే: విజ‌య‌సాయిరెడ్డి

  • పంచాయతీ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే బంపర్ ఆఫర్  
  • ఆన్ లైన్ లో అకౌంట్ కే జమ చేస్తాడట
  • దోచుకున్న లక్షల కోట్లతో ఇలా ఎన్నాళ్లైనా డబ్బు పంపిణీ
vijaya sai slams chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. టీడీపీ మ‌ద్ద‌తుదారులు నామినేష‌న్లు వేస్తే డ‌బ్బులు ఇస్తానంటూ ఆయ‌న చెబుతున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

'చంద్రబాబు జీవితమంతా డబ్బు వెదజల్లడమే. చివరికి పార్టీ గుర్తుల్లేని పంచాయతీ ఎలక్షన్లలో నామినేషన్ వేస్తే బంపర్ ఆఫర్ రూ.2 లక్షలంట! కాస్త పోటీ ఇస్తారనుకుంటే ఐదు లక్షల రూపాయ‌లు. ఆన్ లైన్ లో అకౌంట్ కే జమ చేస్తాడట. దోచుకున్న లక్షల కోట్లతో ఇలా ఎన్నాళ్లైనా డబ్బు పంపిణీకి సిద్ధమంటున్నాడు' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News