తృణమూల్ కు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే... కాసేపటికే బీజేపీలో చేరిక
- టీఎంసీ నుంచి బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు
- తృణమూల్ కు దీపక్ హల్దార్ రాజీనామా
- తనను పనిచేయనివ్వడంలేదని టీఎంసీపై ఆరోపణ
- అతడికి తాము టికెట్ ఇవ్వబోవడంలేదన్న టీఎంసీ
- అందుకే ముందే వెళ్లిపోయాడని వెల్లడి
హల్దార్ రాజీనామాపై టీఎంసీ వర్గాలు స్పందించాయి. అతడు వెళ్లిపోయినందువల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని వెల్లడించాయి. పైగా, అతడికి రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ ఇవ్వాలనుకోలేదని, టీఎంసీ టికెట్ ఇవ్వదన్న విషయం తెలిసే అతడు పార్టీ నుంచి వెళ్లిపోయాడని ఆ వర్గాలు వివరించాయి. ఓ ఎమ్మెల్యేగా హల్దార్ ఆశించిన రీతిలో పనిచేయడంలేదని ఆరోపించాయి.