రకుల్ చేతిలో మరో హిందీ సినిమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రకుల్ చేతిలో మరో హిందీ సినిమా

Rakul signs one more film in Hindi
  • తెలుగులో గ్లామర్ పాత్రలతో అగ్రస్థానం 
  • బాలీవుడ్ లో చేస్తున్న వరుస సినిమాలు 
  • ప్రస్తుతం 'మేడే', 'థ్యాంక్ గాడ్' సినిమాలు
  • 'డాక్టర్ జి'లో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ         
టాలీవుడ్ కి వచ్చిన ముంబై భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ది ఓ ప్రత్యేకత. కేవలం గ్లామర్ పాత్రలే పోషించి టాలీవుడ్ లో అగ్రతారగా పేరుతెచ్చుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఇక్కడ అవకాశాలు వస్తూనే వున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అక్కడా తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగణ్, అమితాబ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'మేడే' సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

మరోపక్క అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్న 'థ్యాంక్ గాడ్' సినిమాలోనూ నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో హిందీ చిత్రానికి సంతకం చేసింది. ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ చిత్రం పేరు 'డాక్టర్ జి'. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జంగిల్ పిక్చర్స్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, తమ బృందంలోకి రకుల్ ని ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది.

అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె డాక్టర్ పాత్రను పోషిస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉందనీ, సినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న ఆత్రుతతో వున్నాననీ రకుల్ ట్వీట్ చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, ఈ చిన్నది దూసుకుపోతోందని చెప్పాలి!
Rakul Preet Singh
Ajay Devagan
Amitabh Bachchan
Ayushman Khurana

More Telugu News