Sensex: కేంద్ర బడ్జెట్ తో ఫుల్ జోష్.. ఏకంగా 2,315 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Sensex gains 2315 points amid union budget
షార్ట్స్‌లో చూడండి
2021-22 కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ వర్గాలను ఆకర్షించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఒక్కసారిగా పుంజుకున్న మార్కెట్లు చివరి వరకు లాభాల్లోనే సాగాయి.

దీంతో  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్లు లాభపడి 48,601కి పెరిగింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. బ్యాకింగ్ 8.33 శాతం, ఫైనాన్స్ 7.49 శాతం, రియాల్టీ 6.65 శాతం పెరిగాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (14.75%), ఐసీఐసీఐ బ్యాంక్ (12.47%), బజాజ్ ఫిన్ సర్వ్ (11.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (10.30%), ఎల్ అండ్ టీ (8.61%).

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-3.70%), టెక్ మహీంద్రా (-1.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.37%) మాత్రమే నష్టపోయాయి.
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News