కర్ణాటకలో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్లకు సోకిన కరోనా!

Karnataka Doctors get Corona After Vaccination
  • వారం క్రితం టీకా తీసుకున్న వైద్యులు
  • ఐదుగురు డాక్టర్లకు కరోనా
  • వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు వద్దన్న నిపుణులు
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో కరోనా టీకాను తీసుకున్న ఐదుగురు డాక్టర్లు మహమ్మారి బారిన పడటంతో కలకలం రేగింది. వీరికి తొలి డోస్ ను తీసుకున్న వారం వ్యవధిలోనే కరోనా సోకింది. దీంతో వ్యాక్సిన్ పనితీరుపై వైద్య సిబ్బంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారం వ్యవధిలో కరోనా సోకినంత మాత్రాన టీకా పనితీరు బాగాలేదని భావించనక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా తీసుకున్న తరువాత దాదాపు 40 రోజులకు శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని అంటున్నారు.

కాగా, తొలి డోస్ తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోస్ ను ఇస్తారు. రెండో డోస్ తీసుకున్న పది రోజులకు శరీరంలో యాంటీ బాడీలు పెరుగుతాయని, అప్పుడే కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. టీకా తొలి డోస్ తీసుకున్న వారు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, మాస్క్ లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని వైద్య నిపుణులు సూచించారు.
Go Back to Shorts
Vaccine
Corona
Karnataka
Doctors

More Telugu News