ఇందిర పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్!
- ప్రత్యేకమైన ఇమేజ్ తో సాగుతున్న కంగన
- కథానాయిక ప్రధాన చిత్రాలలో తనదైన ముద్ర
- ఇప్పటికే 'తలైవి'లో జయలలిత పాత్ర పోషణ
- ఇప్పుడు దిగ్గజ రాజకీయ నాయకురాలి పాత్ర
దీని గురించి కంగన చెబుతూ, "ఇదొక దిగ్గజ రాజకీయ నాయకురాలి పాత్ర. ఓ పుస్తకం ఆధారంగా ఇది తెరకెక్కుతుంది. అప్పటి ఎమర్జన్సీ పరిస్థితులు.. ఆపరేషన్ బ్లూ స్టార్ .. వంటి అంశాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాలో లాల్ బహదూర్ శాస్త్రి, సంజయ్ గాంధీల పాత్రలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పని చివరి దశలో వుంది. ఈ పాత్ర పోషణ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
అయితే, ఇందిర పాత్రను పోషిస్తున్నట్టు మాత్రం నేరుగా చెప్పలేదు. గతంలో కంగన నటించిన 'రివాల్వర్ రాణి' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కబీర్ దీనికి దర్శకత్వం వహిస్తాడు.