కోర్టు ధిక్కరణ కేసులో ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను చేర్చాలంటూ ఎస్ఈసీ పిటిషన్ .. అంగీకరించిన హైకోర్టు

SEC goes to High Court
  • ఏపీ సర్కారుపై గతంలో హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఈసీ
  • హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడంలేదని ఆరోపణ
  • ఇప్పటి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా  చేర్చాలంటూ మరో   పిటిషన్  
  • అందుకు అనుమతించిన కోర్టు
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా 
హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్.. హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అప్పటి సీఎస్ నీలం సాహ్నిల పేర్లను అందులో ప్రధానంగా పేర్కొన్నారు.  తాజాగా.. ఈ పిటిషన్ కు సంబంధించి ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేయగా  హైకోర్టు అందుకు అంగీకరించింది. ఈ పిటిషన్ ఫై వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను  సోమవారానికి వాయిదా వేసింది.
Go Back to Shorts
SEC
Nimmagadda Ramesh Kumar
AP High Court
YSRCP
Andhra Pradesh

More Telugu News