రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ రెండ్రోజుల పర్యటన
- విజయవాడ నుంచి బెంగళూరు పయనం కానున్న ఎస్ఈసీ
- రోడ్డు మార్గంలో అనంతపురం చేరిక
- అధికారులతో సమావేశం
- ఎల్లుండి ఉదయం కడపలో సమావేశం
అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కర్నూలు బయల్దేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశమవుతారు. ఈ సమావేశం సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు సాగనుంది. ఆపై, ఎస్ఈసీ కర్నూలులోనే బస చేయనున్నారు.
శనివారం ఉదయం 6 గంటలకు కర్నూలు నుంచి కడప పయనమవుతారు. కడపలో జిల్లా అధికారులతో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారు. సమావేశం అనంతరం ఉదయం 11.30 గంటలకు కడప నుంచి విజయవాడ పయనం అవుతారు.