స్టయిల్‌గా న‌డుచుకుంటూ వెళుతున్న ర‌వితేజ.. కొత్త సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌!

26-01-2021 Tue 13:18
  • నేడు ర‌వితేజ పుట్టిన‌రోజు
  • ఖిలాడీ నుంచి వీడియో విడుద‌ల‌
  • ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ర‌వితేజ‌
raviteja new movie glimpse

క్రాక్ సినిమా ద్వారా వ‌చ్చిన‌ హిట్‌తో జోరు మీదున్న‌ టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌స్తుతం ఖిలాడి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ రోజు ర‌వితేజ తన పుట్టిన‌రోజు వేడుక‌ను జ‌రుపుకుంటోన్న నేప‌థ్యంలో ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. చేతిలో ఆయుధాన్ని ప‌ట్టుకుని ర‌వితేజ స్టైల్ గా న‌డుచుకుంటూ వెళ్తున్నాడు.

అద్భుత మ్యూజిక్ ఆయ‌న హావ‌భావాల‌కు త‌గ్గ‌ట్టుగా ఇందులో విన‌ప‌డుతోంది. మాస్ మ‌హారాజా అభిమానులను ఈ వీడియో ఆకర్షిస్తోంది. ఇది ర‌వితేజ న‌టిస్తోన్న‌ 67వ సినిమా. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమా డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ర‌వితేజ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. ఈ సినిమాకు‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.