Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 94 కొత్త కేసులు, 1 మరణం

AP Corona Virus update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గత 24 గంటల్లో 31,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 94 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 14 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 3, శ్రీకాకుళంలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 232 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,139కి పెరిగింది.

ఏపీలో ఇప్పటివరకు 8,85,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,76,372 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,199కి తగ్గింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Deaths
Active Cases

More Telugu News