'సలార్' షూటింగ్ ప్రారంభం.. వైరల్ అవుతున్న ప్రభాస్, యశ్ ఫొటోలు
- హైదరాబాదులో అట్టహాసంగా 'సలార్' పూజా కార్యక్రమం
- ముఖ్య అతిథిగా విచ్చేసిన యశ్
- 'సలార్'కు దర్శకత్వం వహిస్తున్న 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్
'సలార్' చిత్రంలో ప్రభాస్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. సలార్ అంటే ఒక సమర్థవంతమైన నాయకుడని... రాజుకి కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశాంత్ నీల్ ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ కూడా 'కేజీఎఫ్ 2' సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మరోవైపు, తనకు ఈ సినిమాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా యశ్ ఇక్కడే ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు.