తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్!

12-01-2021 Tue 10:43
  • కొత్తగా 301 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,90,309
  • కోలుకున్న వారు 2,84,217 మంది
  • మృతుల సంఖ్య 1,568
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 301 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో  293 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,90,309 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,84,217 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,568కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,524 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  2,459 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి.