Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 295 కొత్త కేసులు, ఒక మరణం

AP Corona Update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 59,410 కరోనా టెస్టులు నిర్వహించగా, 295 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 45 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 39, గుంటూరు జిల్లాలో 35, తూర్పుగోదావరిలో 32 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 9, కడప జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 368 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఆ ఒక్క మరణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,171 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,74,223 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,822 మందికి చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,126కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
Positive Cases
Deaths
Active Cases

More Telugu News