మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డికి సోకిన కరోనా!
- ఇటీవల స్వల్ప అనారోగ్యం
- పరీక్షలు చేయించుకుంటే కరోనా పాజిటివ్
- ఇంట్లోనే చికిత్స పొందుతున్న సోమిరెడ్డి
ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, సోమిరెడ్డి గత కొన్ని రోజులుగా విస్తృతంగా పర్యటనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది.