Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్

  • 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,410
  • కోలుకున్న వారు  2,81,872 మంది
  • మృతుల సంఖ్య  1,556
417 new cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 472 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,410కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,81,872 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,556కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,982మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,748  మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 82 కరోనా కేసులు నమోదయ్యాయి.
 

More Telugu News