జనసైనికురాలి తల్లి వైద్య ఖర్చులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం

 Pawan Kalyan donates one lakh rupees for a Janasena worker
షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఓ జనసైనికురాలి తల్లి పాముకాటుకు చికిత్స పొందుతోందని తెలిసి ఆర్థికసాయం చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలానికి చెందిన జనసేన కార్యకర్త లక్ష్మీప్రసన్న తల్లి ఇటీవల పాముకాటుకు గురైంది.

అయితే, తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆమె చికిత్స పొందుతుండగా, లక్ష్మీప్రసన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం పవన్ కల్యాణ్ కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి లక్ష రూపాయల సాయం ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాదులోని జనసేన పార్టీ  కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ లక్ష రూపాయల చెక్ ను లక్ష్మీప్రసన్నకు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Donation
Lakshmi Prasanna Yogi
Anantapur District
Janasena

More Telugu News